మొహరానికి కరోనా ఎఫెక్ట్
దిశ, ఆందోల్: త్యాగాలకు ప్రతీకగా, కులమతాలకు అతీతంగా జరుపుకునే మొహరం (పీర్ల) పండుగ వేడుకలు కరోనా కారణంగా ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఉత్సవంగా ప్రజలు అసైదుల ఆటలు ఆడుతూ సంబరం చేసుకునేవారు. మహిళలు సైతం అచ్చన్న వూచన్న ఆటలు ఆడేవారు. కానీ కరోనా కారణంగా అలాంటి ఆటపాటలేవీ కనిపించలేదు. జోగిపేటలోని ఉదయం 6 గంటలకే క్లాక్ టవర్ వద్ద పెద్ద పీరు, కుడుకల పీర్లు కలుసుకున్నాయి. అందోల్ మండల పరిధిలోని డాకూర్ […]
దిశ, ఆందోల్: త్యాగాలకు ప్రతీకగా, కులమతాలకు అతీతంగా జరుపుకునే మొహరం (పీర్ల) పండుగ వేడుకలు కరోనా కారణంగా ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఉత్సవంగా ప్రజలు అసైదుల ఆటలు ఆడుతూ సంబరం చేసుకునేవారు. మహిళలు సైతం అచ్చన్న వూచన్న ఆటలు ఆడేవారు. కానీ కరోనా కారణంగా అలాంటి ఆటపాటలేవీ కనిపించలేదు.
జోగిపేటలోని ఉదయం 6 గంటలకే క్లాక్ టవర్ వద్ద పెద్ద పీరు, కుడుకల పీర్లు కలుసుకున్నాయి. అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో పీర్ల పండుగ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. గ్రామంలో మౌలాలి, బీబీ పద్మ, దూది పీర్, సర్కార్ పీర్లు ఉన్నాయి. గ్రామ ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పండుగను జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా ఘనంగా జరగాల్సిన మొహరం (పీర్ల) పండుగ కరోనా ప్రభావంతో నిరాడంబరంగా చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జోగిపేట ఎస్సై వెంకట రాజా గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.