కరోనా భయం.. తగ్గిన ఖైరతాబాద్ గణపతి

దిశ, వెబ్ బెస్క్: భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ ఏ పండగైనా, ఉత్సవం అయినా అన్ని కులాలు, మతాల వాళ్లు ఐకమత్యంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిఏకాదశితో పండుగలు ప్రారంభం అవుతుంటాయి. అయితే, ఈ ఏడాది జరిగే పండుగల్లో అటువంటి సందడి కనిపించడం లేదు. గోల్కొండ బోనాలు ప్రారంభమైనా కరోనా వైరస్ భయంతో అతి కొద్ది మందితో అమ్మవారికి బోనం సమర్పించారు. అలాగే వినాయక […]

Update: 2020-07-02 06:28 GMT
కరోనా భయం.. తగ్గిన ఖైరతాబాద్ గణపతి
  • whatsapp icon

దిశ, వెబ్ బెస్క్: భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ ఏ పండగైనా, ఉత్సవం అయినా అన్ని కులాలు, మతాల వాళ్లు ఐకమత్యంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిఏకాదశితో పండుగలు ప్రారంభం అవుతుంటాయి. అయితే, ఈ ఏడాది జరిగే పండుగల్లో అటువంటి సందడి కనిపించడం లేదు. గోల్కొండ బోనాలు ప్రారంభమైనా కరోనా వైరస్ భయంతో అతి కొద్ది మందితో అమ్మవారికి బోనం సమర్పించారు. అలాగే వినాయక చవితి కూడా ఎలాంటి సందడి లేకుండనే నిర్వహించేలా ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడిపై కరోనా ప్రభావం పడింది. ప్రతి ఏడాది ఈపాటికే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో వినాయకుడి ప్రతిమ తయారీని ప్రారంభించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దేశంలోనే అతి పెద్ద గణనాథుడి విగ్రహం స్థానంలో ఈసారి 27 అడుగులతో కూడిన ధన్వంతరి మట్టి వినాయకుడిని నిర్మించాలని ఉత్సవ కమిటీ భావిస్తోంది. గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్నాడు ఖైరతాబాద్ గణేషుడు. గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు తగ్గింది విగ్రహ ఆకారం. భౌతిక దూరం పాటిస్తూ రోజు కొద్దిమంది భక్తులకే దర్శనం కల్పించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.

Tags:    

Similar News