ఫ్రంట్ లైన్ వారియర్స్‌పై కరోనా ఎఫెక్ట్

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: హాస్పిట‌ల్స్ లో ప‌నిచేసే ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ పై కరోనా ప్రభావం చూపుతోంది. ఆస్పత్రుల్లో ప‌నిచేసే ప‌లువురు వైద్యులు, సిబ్బంది కొవిడ్ బారిన ప‌డుతున్నారు. ఈఎన్టీ ఆస్పత్రిలో ప‌నిచేస్తున్న ఓ వైద్యుడికి క‌రోనా పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలో ప‌నిచేసే మ‌రికొంత మంది వైద్యులు, సిబ్బందికి కూడా కొవిడ్ ల‌క్షణాలు క‌న‌బ‌డ‌డంతో వారు కూడా వైద్య ప‌రీక్షలు చేయించుకుంటున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ప‌నిచేస్తున్న ప‌లువురు వైద్యులు, సిబ్బంది కూడా క‌రోనా ల‌క్షణాలు […]

Update: 2021-03-23 11:49 GMT

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: హాస్పిట‌ల్స్ లో ప‌నిచేసే ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ పై కరోనా ప్రభావం చూపుతోంది. ఆస్పత్రుల్లో ప‌నిచేసే ప‌లువురు వైద్యులు, సిబ్బంది కొవిడ్ బారిన ప‌డుతున్నారు. ఈఎన్టీ ఆస్పత్రిలో ప‌నిచేస్తున్న ఓ వైద్యుడికి క‌రోనా పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలో ప‌నిచేసే మ‌రికొంత మంది వైద్యులు, సిబ్బందికి కూడా కొవిడ్ ల‌క్షణాలు క‌న‌బ‌డ‌డంతో వారు కూడా వైద్య ప‌రీక్షలు చేయించుకుంటున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ప‌నిచేస్తున్న ప‌లువురు వైద్యులు, సిబ్బంది కూడా క‌రోనా ల‌క్షణాలు క‌న‌బ‌డ‌డంతో ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు.

కింగ్ కోఠి ఆస్పత్రిలో చికిత్సలు..

కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రికి కరోనా రోగుల తాకిడి ఇటీవ‌ల కాలంగా మ‌ళ్లీ పెరిగింది. ఈ ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా గుర్తించిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం ఆస్పత్రికి ఓపీ విభాగంలో కొవిడ్ ల‌క్షణాలతో 148మంది రాగా వీరికి వైద్య ప‌రీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఫిమేల్ ఐసోలేష‌న్ లో 17 మంది, మేల్ ఐసోలేష‌న్ లో 50 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 30 మంది రోగులున్నారు. తాజాగా, ఆస్పత్రిలో మొత్తం 53 మంది క‌రోనా పాజిటివ్ రోగులు వైద్య చికిత్స పొందుతుండ‌గా, మ‌రో 8 మందిని హోం క్వారంటైన్ కు త‌ర‌లించారు.

డీఎంహెచ్ఎస్‌లో క్యాంటీన్ య‌జ‌మానికి..

డీఎం హెచ్ఎస్ ఆవ‌ర‌ణ‌లోని క్యాంటీన్ య‌జ‌మానికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ ఆవ‌ర‌ణ‌లో డీఎంఈ, డీహెచ్, వైద్య విధాన ప‌రిష‌త్, కుటుంబ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్, టీఎస్ఎంఎస్ఐడీసీ త‌దిత‌ర కార్యాల‌యాలు ఉన్నాయి. వాటిలో ప‌నిచేసే ఉద్యోగులు ప్రతినిత్యం ఇదే క్యాంటీన్ వ‌ద్ద టీ, మంచినీరు తాగుతుంటారు. క్యాంటీన్ య‌జ‌మాని క‌రోనా బారిన ప‌డ‌డంతో ఇక్కడ నిత్యం టీ తాగేవారు ఆందోళ‌న‌కు గురవుతున్నారు. మ‌రో మారు కొవిడ్ కేసులు చాప‌కింద నీరులా పెరిగిపోతుండ‌డం ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

Tags:    

Similar News