బాణాసంచా విక్రయాలపై కరోనా ఎఫెక్ట్

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా నగరంలో బాణా సంచా అమ్మకాలపై స్తబ్ధత కొనసాగుతోంది. కరోనా కారణంగా పటాకులు కాల్చరాదని, కాలుష్యంతో కరోనా ప్రభా వం పెరిగే అవకాశం ఉందని విస్తృ తం గా ప్రచారం జరగడంతో వ్యాపారులు, మరో వైపు ప్రజల్లో గందరగోళం నెల కొంది. చలికాలంలో వైరస్ వేగంగా వ్యా ప్తి చెందే అవకాశం ఉండడంతో దీపా వళి పండుగ సందర్భంగా ప్రజలు బాణా సంచా కాల్చేందుకు ఎంత వరకు ముం దుకు […]

Update: 2020-11-10 00:15 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా నగరంలో బాణా సంచా అమ్మకాలపై స్తబ్ధత కొనసాగుతోంది. కరోనా కారణంగా పటాకులు కాల్చరాదని, కాలుష్యంతో కరోనా ప్రభా వం పెరిగే అవకాశం ఉందని విస్తృ తం గా ప్రచారం జరగడంతో వ్యాపారులు, మరో వైపు ప్రజల్లో గందరగోళం నెల కొంది. చలికాలంలో వైరస్ వేగంగా వ్యా ప్తి చెందే అవకాశం ఉండడంతో దీపా వళి పండుగ సందర్భంగా ప్రజలు బాణా సంచా కాల్చేందుకు ఎంత వరకు ముం దుకు వస్తారు? అమ్మకాలు గతేడాదిలా ఉంటాయా? అనే విషయంలో వ్యా పారు లు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.

అధికారుల అయోమయం..
దీపావళి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారులు, మైదానాల్లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఈ యేడాది కరోనా కారణంగా వీటి ఏర్పాటులో ప్ర భుత్వం ఆచీతూచి నిర్ణయం తీసుకుంటుండగా వ్యాపారులు సైతం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సాధారణంగా గతంలో దసరాకు ముందు నుంచే బేగంబజార్, ఉస్మాన్ గంజ్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో హోల్ సేల్ దుకా ణాల నుంచి నగరంతో పాటు జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసే వారు. దీంతో దీపావళికి సుమారు నెల రోజుల ముందు నుంచే పటాకుల దుకాణాల్లో సందడి నెలకొనేది. ఈయేడు ఇప్పటి వరకు దుకాణాల్లో ఎలాంటి రద్దీ కనిపించడం లేదు.

అనుమతులు తప్పనిసరి..
కొవిడ్ నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసే రిటైల్, హోల్ సేల్ దుకాణాలకు ఫైర్, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల నుంచి ఆన్ లైన్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఔట్ లెట్స్ వద్ద అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిలిండర్లతో పాటు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. దుకాణదారులు స్థలయజమాని అనుమతి లిఖిత పూర్వకంగా తీసుకుని అధికారులకు అందజేయాలి. గతంతో పోలిస్తే కొవిడ్ కారణంగా నిబంధనలు కఠినతరం కావడంతో పటాకుల అమ్మకాలపై ఎంత మేర ప్రభావం ఉంటుందోనని వ్యాపారులు సందిగ్ధంలో ఉన్నారు.

పరిమిత సంఖ్యలో దరఖాస్తులు..
పటాకుల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి తీసుకోవాలి. ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని రూ.500 చెల్లించాలి. పోలీస్, జీహెచ్ఎంసీ, స్థల యజమాని నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. రోడ్ లను అనుసరించి ఏర్పాటు చేసే దుకాణాలు ఒకదానికి ఒకటి కనీసం మూడు గజాల దూరంలో ఉండాలి. ఫైర్ సిలిండర్లు, నీరు అందుబాటులో ఉంచుకోవాలి. గతేడాది వీధుల్లో సుమారు 500 దుకాణాలకు అనుమతులు ఇచ్చాం. ఈ యేడు అనుమతుల కోసం పరిమిత సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దీపాళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలకు కేవలం పదిహేను రోజుల గడువు తోనే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది.‌‌
–శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్

Tags:    

Similar News