జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా ఎఫెక్ట్
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ ప్రభావంతో జోగులాంబ గద్వాల జిల్లాలో అధికారులు, పలు సంస్థలు అప్రమత్తమయ్యాయి. కరోనా నేపథ్యంలో గద్వాల బార్ అసోసియేషన్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర కేసులు మాత్రమే విచారణ జరిపేందుకు గద్వాల జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. కేసులున్న లాయర్లకే కోర్టుల్లోకి ప్రవేశం కల్పిస్తూ, జిల్లా కోర్టుల్లో పిటిషన్లను 3 వారాలు వాయిదా వేస్తూ.. బార్ అసోసియేషన్ల గదులు మూసివేశారు. అత్యవసర కేసుల విచారణ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఉచితంగా కోళ్ల […]
దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ ప్రభావంతో జోగులాంబ గద్వాల జిల్లాలో అధికారులు, పలు సంస్థలు అప్రమత్తమయ్యాయి. కరోనా నేపథ్యంలో గద్వాల బార్ అసోసియేషన్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర కేసులు మాత్రమే విచారణ జరిపేందుకు గద్వాల జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. కేసులున్న లాయర్లకే కోర్టుల్లోకి ప్రవేశం కల్పిస్తూ, జిల్లా కోర్టుల్లో పిటిషన్లను 3 వారాలు వాయిదా వేస్తూ.. బార్ అసోసియేషన్ల గదులు మూసివేశారు. అత్యవసర కేసుల విచారణ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
ఉచితంగా కోళ్ల పంపిణీ:
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవళ్ళి చౌరస్తాలో కోళ్లు ఫ్రీగా పంపిణీ చేయడం జరిగింది. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో చికెన్ సేల్ కాకపోవడంతో బాయిలర్ కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. సామాన్యంగా ఉచితంగా వస్తున్న వాటికి ఎగబడే జనాలు ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. కోళ్లను పంపిణీ కోసం సదరు వ్యాపారి లారికి బోర్డ్ పెట్టిన ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో చివరకు కేకలు వేసిన కూడా ప్రజలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.
బ్యాంకు వద్ద నీరు ఏర్పాటు:
జడ్చేర్ల ఐసీఐసిఐ బ్యాంకు వద్ద ఖాతాదారులు చేతుకు కడుకొని లోపలికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. బ్యాంక్ ప్రధాన ముఖద్వారం వద్దనే ఖాతాదారులు చేతులు కడుకునేందుకు వీలుగా నీటి సౌకర్యం కల్పించారు. బ్యాంక్ లావాదేవీలు నిర్వహించడానికి వచ్చే ప్రతి ఒక్కరు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కిందిస్థాయి సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ప్రయణాలను వాయిదా వేసుకుంటున్నారు. నిత్యం రద్దీగా కనిపించే జాతీయ రహదారులు కూడా బోసిపోతున్నాయి.
tag: Corona Effect, free chicken, bar association closed, Jogulamba Gadwal