40 కోట్ల మంది పేదరికంలోకి..!
దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలో రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానంలో భారీగా మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయి. సుమారు ఎనభై ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ప్రజల జీవన విధానంలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచానికి దీనికి మించిన ముప్పు వచ్చింది. అంతర్జాతీయంగా అన్ని దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా మన దేశంలో అనేక మార్పులు రాబోతున్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక […]
దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలో రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానంలో భారీగా మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయి. సుమారు ఎనభై ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ప్రజల జీవన విధానంలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచానికి దీనికి మించిన ముప్పు వచ్చింది. అంతర్జాతీయంగా అన్ని దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా మన దేశంలో అనేక మార్పులు రాబోతున్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చింది. ఇండియాలోని అసంఘటిత రంగంలో సుమారు 40 కోట్ల మంది పేదరికంలో జారిపోతారని ఐరాస అభిప్రాయపడింది.
ఐరాస ఇచ్చిన నివేదికలో ప్రపంచంలో మొత్తం 200 కోట్ల మంది వరకూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, వారందరూ కరోనా మహమ్మరి కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక చెబుతోంది. ప్రధానంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీనివల్ల రోజూవారి కూలీలపి అత్యధికంగా ప్రభావం ఉందని, వారంతా సొంత ఊళ్లకు వెళ్లిపోవడం వల్ల ఇవన్నీ సాధారణ స్థితిలోకి రావడానికి, ప్రజలు వలస వెళ్లి ఉపాధి వెళ్లేందుకు సిద్ధమవ్వడానికి కొంత సమయం పడుతుంది.
ప్రపపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని అంచనా వేసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ‘ఐఎల్‌వో మానిటర్;కోవిడ్-19 అండ్ ది వరల్డ్ ఆఫ్ వర్క్’ అనే పేరుతో నివేదిక ఇచ్చింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సంక్షోభంగా కోవిడ్-19 మహమ్మారి అని ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తగిన చర్యలు తీసుకుని, భవిష్యత్తుని అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితిలో మార్పు ఉండొచ్చని ఐఎల్‌వో డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.
గడిచిన 70 ఏళ్ల చరిత్రలో ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఈ స్థాయి సంక్షోభాన్ని చూడలేదని ఐఎల్‌వో పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిని అధిగమించాలంటే ప్రపంచంలోని అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటే గట్టెక్కే అవకాశముందని సూచించింది. ప్రధానంగా కరోనా బారిన పడి ఎక్కువ నష్టాన్ని భరించే దేశాలను ఆదుకోవాల్సి అవసరముందని తెలిపింది. ప్రస్తుత పరిణామాల్లో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు ప్రపంచ గతిని మార్చి, ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయని తెలిపింది. అంతర్జాతీయంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో నలుగురు ఈ ప్రభావానికి గురవుతారని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆహారం, ఉత్పత్తి, వ్యాపారం, రిటైల్, వసతి, పాలనా రంగాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూస్తామని ఐఎల్‌వో అభిప్రాయపడింది.
TAgs: coronavirus, covid-19, india The International Labour Organization, ILO,