తల్లి పాలతో కరోనా రాదని.. సర్వే చెబుతోంది
దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్-19 సమయంలో ‘బ్రెస్ట్ ఫీడింగ్ పై ఆందోళన’ఎలా ఉన్నదన్న అంశంపై సర్వే నిర్వహించినట్లు మామ్స్ ప్రెస్సో డాట్ కాం సంస్థ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎడిటర్ పరుల్ ఓర్హి చెప్పారు. తాజాగా విడుదల చేసిన సర్వేలో 93 శాతం మంది కరోనా సంక్షోభంలో పిల్లలకు పాలిచ్చే అంశంలో ఆందోళన చెందుతున్నారని వెల్లడైంది. 80 శాతానికి పైగా తల్లులు వారి పిల్లల ఇమ్యూనిటీని, న్యూట్రిషన్ అవసరాలను పెంచినట్లు చెప్పారు. ప్రతి పది మందిలో ఏడుగురు వారి […]
దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్-19 సమయంలో ‘బ్రెస్ట్ ఫీడింగ్ పై ఆందోళన’ఎలా ఉన్నదన్న అంశంపై సర్వే నిర్వహించినట్లు మామ్స్ ప్రెస్సో డాట్ కాం సంస్థ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎడిటర్ పరుల్ ఓర్హి చెప్పారు. తాజాగా విడుదల చేసిన సర్వేలో 93 శాతం మంది కరోనా సంక్షోభంలో పిల్లలకు పాలిచ్చే అంశంలో ఆందోళన చెందుతున్నారని వెల్లడైంది. 80 శాతానికి పైగా తల్లులు వారి పిల్లల ఇమ్యూనిటీని, న్యూట్రిషన్ అవసరాలను పెంచినట్లు చెప్పారు. ప్రతి పది మందిలో ఏడుగురు వారి పిల్లల ఆరోగ్యం, శానిటైజేషన్‌పై కలవరపడ్డారు. ఐతే 99 శాతం తల్లులు తల్లి పాలు పిల్లలను ఇన్ఫెక్షన్ల నుంచి, రోగాల నుంచి రక్షిస్తాయని అభిప్రాయపడ్డారు. సర్వేలో అనేకాంశాలపై ఫలితాలను వివరించారు.
కొవిడ్-19లో పిల్లల పట్ల ఆందోళన గురి చేసిన అంశాలు?
– పిల్లలు జబ్బున పడకుండా చూసుకుంటామని 37 శాతం మంది తల్లులు చెప్పారు.
– పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని, రెగ్యూలర్‌గా శానిటైజ్ చేస్తామని 25 శాతం తెలిపారు.
– తల్లి జబ్బున పడకుండా చూసుకుంటామని 13 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించారు.
– బేబీకి రెస్పిరటరీ ప్రాబ్లెం రాకుండా చూస్తున్నామని 8 శాతం మంది తెలిపారు.
– అత్యవసర సమయాల్లో డాక్టర్ దొరక్కపోతే ఆందోళన చెందినట్లు 7 శాతం మంది చెప్పారు.
సర్వేలో తేలిన అంశాలు
-10 మందిలో 9 మంది వాళ్ల పిల్లలకు మరింత ఇమ్యూనిటీని పెంచాలనుకుంటున్నారు.
– ఐదుగురిలో నలుగురు తల్లి పాలతో పాటు న్యూట్రిషన్లను కూడా అందిస్తున్నారు.
-93 శాతం మంది కరోనా సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్‌పై ఆందోళన చెందుతున్నారు.
– పది మందిలో నలుగురు వాళ్ల పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ జబ్బున పడకుండా చూసుకోవాలనుకుంటున్నారు.
-2 శాతం మంది మహిళలు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ పై ఎలాంటి ఆందోళన లేదన్నారు.
– ఐదుగురిలో ముగ్గురు కొవిడ్ సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్ ఛాలెంజింగ్ తీసుకున్నారు.
– ఐదుగురిలో నలుగురు బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
– 99 శాతం తల్లులు తల్లి పాలు పిల్లలను ఇన్ఫెక్షన్ల నుంచి, రోగాల నుంచి రక్షిస్తాయని చెప్పారు.
– కరోనా వైరస్ ప్రభావం తల్లులపై ఉంటుందని పది మందిలో ఎనిమిది మంది మహిళలు ఫీల్ అయ్యారు.
సర్వే విధానం..
ఈ సర్వేను వెబ్ ఆధారితంగా నిర్వహించినట్లు మామ్స్ ప్రెస్సో ప్రకటించింది. ఇందులో 25-35, 36-45 మధ్య వయసు గ్రూపుల వారిని సర్వే చేశారు. 35 శాతం వర్కింగ్, 65 శాతం మంది నాన్ వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. సర్వేలో హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ, కోల్ కత్తా, బెంగుళూరు, చెన్నై, పూణె, అహ్మదాబాద్ పట్టణాలకు చెందిన వారు పాల్గొన్నారు.