దేశంలో కరోనా తీవ్రరూపం.. కొత్తగా ఎన్ని కేసులంటే?
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,66,317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. వైరస్ బారినపడి కొత్తగా 3,747 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,46,146 కు పెరిగింది. దేశంలో కరోనా వైరస్ సోకి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,66,317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. వైరస్ బారినపడి కొత్తగా 3,747 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,46,146 కు పెరిగింది. దేశంలో కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న వారిసంఖ్య 37,41,368కు చేరింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉండగా, దేశంలోని గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకున్నారు. ఇదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది.