కరోనా బాధితులకు ఎనిమిది హాస్పిటళ్లలో చికిత్స
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడి కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం చికిత్సనందించే ఆస్పత్రుల సంఖ్యను కూడా పెంచింది. ఇకమీదట ఎనిమిది ఆస్పత్రుల్లో బాధితులకు చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరర్లను ఆదేశించింది. కరోనా ఆస్పత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. 1. గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ 2. జిల్లా హాస్పిటల్, కింగ్ కోఠి, హైదరాబాద్ […]
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడి కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం చికిత్సనందించే ఆస్పత్రుల సంఖ్యను కూడా పెంచింది. ఇకమీదట ఎనిమిది ఆస్పత్రుల్లో బాధితులకు చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరర్లను ఆదేశించింది. కరోనా ఆస్పత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్
2. జిల్లా హాస్పిటల్, కింగ్ కోఠి, హైదరాబాద్
3. గచ్చిబౌలి హాస్పిటల్, హైదరాబాద్
4. నేచర్ క్యూర్ హాస్పిటల్, బేగంపేట్, హైదరాబాద్
5. ప్రభుత్వ నిజామియా జనరల్ హాస్పిటల్, చార్మినార్, హైదరాబాద్
6. ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్, ఎర్రగడ్డ, హైదరాబాద్
7. ప్రభుత్వ ఆయుర్వేద బోధనాస్పత్రి, వరంగల్
8. డీకే ప్రభుత్వ హోమియో హాస్పిటల్, రామాంతపూర్, హైదరాబాద్
Tags: corona out break, corona cases increased in telangana, hospitals increase, total 8 hospitals treat for corona patients