ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 62,657 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా 1,578 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,24,421కి చేరింది. కరోనా పాజిటివ్ కేసులలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 31 కేసులు నమోదయ్యాయి. ఇకపోతే నిన్న ఒక్కరోజులో […]

Update: 2021-07-12 08:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 62,657 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా 1,578 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,24,421కి చేరింది. కరోనా పాజిటివ్ కేసులలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 31 కేసులు నమోదయ్యాయి.

ఇకపోతే నిన్న ఒక్కరోజులో కరోనా బారినపడి 22 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 13,024 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,041 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 18,84,202కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,30,48,945 మంది శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో పేర్కొంది.

Tags:    

Similar News