అంతర్జాతీయ క్రికెట్‌కు అండర్సన్ వీడ్కోలు
దిశ, స్పోర్ట్స్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం 29 ఏళ్లకే అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే త్వరలో అమెరికాలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ టీమ్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతోనే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తున్నది. 2012లో న్యూజిలాండ్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన అండర్సన్.. 2014లో వెస్టిండీస్‌పై కేవలం 31 బంతుల్లోనే వన్డేలో సెంచరీ కొట్టి అందరి దృష్టిని […]
దిశ, స్పోర్ట్స్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం 29 ఏళ్లకే అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే త్వరలో అమెరికాలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ టీమ్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతోనే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తున్నది. 2012లో న్యూజిలాండ్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన అండర్సన్.. 2014లో వెస్టిండీస్‌పై కేవలం 31 బంతుల్లోనే వన్డేలో సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతే కాకుండా ఐపీఎల్‌లో కూడా ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. కాగా, న్యూజిలాండ్ తరపున 2018లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అండర్సన్ ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టీ20తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.