ఓయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్​ప్రొఫెసర్ల బదిలీపై విచారణ

దిశ, తెలంగాణ బ్యూరో : గత కొంత కాలంగా ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర వివాదం రేపుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీల వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం విచారణ నిర్వహించనుంది. వర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ అధ్యాపకులను సెప్టెంబర్‌లో బదిలీ చేశారు. కేవలం ఒక కళాశాలకు మాత్రమే ప్రిన్సిపాల్‌గా వ్యవహరించే అధికారి అధ్యాపకులను మరో కళాశాలకు ఎలా బదిలీ చేస్తారని కాంట్రాక్ట్ అధ్యాపకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఎలాంటి లిఖిత ఉత్తర్వులు […]

Update: 2021-11-16 11:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గత కొంత కాలంగా ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర వివాదం రేపుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీల వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బుధవారం విచారణ నిర్వహించనుంది. వర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ అధ్యాపకులను సెప్టెంబర్‌లో బదిలీ చేశారు.

కేవలం ఒక కళాశాలకు మాత్రమే ప్రిన్సిపాల్‌గా వ్యవహరించే అధికారి అధ్యాపకులను మరో కళాశాలకు ఎలా బదిలీ చేస్తారని కాంట్రాక్ట్ అధ్యాపకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా ఎలాంటి లిఖిత ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాలతో బదిలీలు ఎలా సాధ్యమని నిలదీస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లతో లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయించారని వారు మంగళవారం తమ ఆవేదనను వెలిబుచ్చారు.

ఇది నిబంధనలకు విరుద్ధమని, బదిలీలపై రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేయాలని అధ్యాపకులు విధుల్లో చేరేందుకు నిరాకరించడంతో అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయనీయకుండా, తరగతులు తీసుకోనీయకుండా, ఇన్విజిలేషన్ విధులు కేటాయించకుండా ప్రిన్సిపాళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దీనిపై తాము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా వారు సైతం ఓయూ అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పారు. కాగా దీనిపై హెచ్ఆర్‌సీ బుధవారం విచారణ చేపట్టనుందని కాంట్రాక్ట్​ప్రొఫెసర్లు తెలిపారు.

Tags:    

Similar News