అడవుల్లో అండర్ పాస్‌ల నిర్మాణం

దిశ, తెలంగాణ బ్యూరో : వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా అడవుల్లో అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అటవీ ప్రాంతాల్లో ఉండే జీవులు స్వేచ్ఛగా సంచరించేందుకు అభయారణ్యాల్లో వీటిని వేగంగా నిర్మించేందుకు వన్యప్రాణి మండలి కూడా ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంగళవారం అటవీశాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… గిరిజన ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల‌ కల్పనకు రాష్ర్ట ప్రభుత్వం […]

Update: 2021-09-07 10:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా అడవుల్లో అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అటవీ ప్రాంతాల్లో ఉండే జీవులు స్వేచ్ఛగా సంచరించేందుకు అభయారణ్యాల్లో వీటిని వేగంగా నిర్మించేందుకు వన్యప్రాణి మండలి కూడా ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో మంగళవారం అటవీశాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ… గిరిజన ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల‌ కల్పనకు రాష్ర్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో వేగంగా ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టి, ప్రజలు, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలన్నారు. అంతేగాక వచ్చే ఏడాది జనవరి నుంచి పులుల లెక్కింపు ప్రక్రియకు సిద్ధంగా ఉండాలన్నారు. దీనికి స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల స‌హకారం తీసుకోవాల‌న్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికార ఆర్.శోభ, బోర్డు సభ్యులు కోవా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News