340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం: మంత్రి కేటీఆర్ 

దిశ, పటాన్‌చెరు: ఓఆర్ఆర్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ఔటర్ రింగ్ రోడ్డును మరిపించే విధంగా 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని.. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గురువారం పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి ఓఆర్ఆర్ పై ఎల్ఈడీ లైటింగ్ సిస్టం ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మొదటి దశలో 30 కోట్ల రూపాయలతో, రెండవ దశలో 100 కోట్ల ఇరవై రెండు […]

Update: 2021-12-16 12:06 GMT

దిశ, పటాన్‌చెరు: ఓఆర్ఆర్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ఔటర్ రింగ్ రోడ్డును మరిపించే విధంగా 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని.. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గురువారం పటాన్‌చెరు సమీపంలోని ముత్తంగి ఓఆర్ఆర్ పై ఎల్ఈడీ లైటింగ్ సిస్టం ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మొదటి దశలో 30 కోట్ల రూపాయలతో, రెండవ దశలో 100 కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలతో సర్వీస్ రోడ్డు కలిపి 270.5 కిలోమీటర్ల పరిధిలో 9706 కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి వాటిలో 18220 ఎల్ఈడీ లైట్లను అమర్చి విదేశాలలో ఉన్న తీరుగా ఓఆర్ఆర్ ను ప్రకాశవంతంగా తీర్చిదిద్దామన్నారు.

పెద్ద పరిశ్రమలను ఆకర్షించి విదేశాలలో పెట్టుబడిదారులను సంగారెడ్డి జిల్లాలో మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రయత్నం చేస్తుందన్నారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు ఎంపీపీలు, స్థానిక సర్పంచ్‌ల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్కులో యాభై పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పించామని మొదటి దశగా ఏడు పరిశ్రమలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News