భార్యకు చుక్కలు చూపిస్తున్న కానిస్టేబుల్.. అసలేం జరిగిందంటే ?
దిశ ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఆయన్ను పెళ్లి చేసుకుంటే తన జీవితం సుఖంగా ఉంటుందని భావించింది ఓ మహిళ. అందులోనూ ఆయనది పోలీస్ ఉద్యోగం, కావడంతో పెళ్లికి ఒకే చెప్పింది. కానీ వారి అన్యోన్యం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన కొత్తలో అన్యోన్యంగానే జీవించినా, వారు మధ్యలో పలు మార్లు గోడవపడ్డారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ వివాదం పెరిగింది. భర్త తీరు పట్ల విసుగు చెందిన భార్య గతంలోనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. […]
దిశ ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఆయన్ను పెళ్లి చేసుకుంటే తన జీవితం సుఖంగా ఉంటుందని భావించింది ఓ మహిళ. అందులోనూ ఆయనది పోలీస్ ఉద్యోగం, కావడంతో పెళ్లికి ఒకే చెప్పింది. కానీ వారి అన్యోన్యం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన కొత్తలో అన్యోన్యంగానే జీవించినా, వారు మధ్యలో పలు మార్లు గోడవపడ్డారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ వివాదం పెరిగింది. భర్త తీరు పట్ల విసుగు చెందిన భార్య గతంలోనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా అతని ప్రవర్తన లో మార్పు రాలేదు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖాతా గ్రామానికి చెందిన రజిత కి సుంకరి సిద్దయ్య తో 2013 లో వివాహమైంది. ప్రస్తుతం ఆయన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.
గత రెండు సంవత్సరాలు గా ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడి ఆమెను ఇబ్బందులకు గురి చేయడం తో పోలీసులకు పిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టం ఐపీసీ 498-A, 324, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ లో ఉండి కూడా ఆమెను ఇబ్బందులకు గురి చేసేవాడు. నాతో విడాకులు తీసుకోకుండానే నాగరాజుపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయి తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు అని రజిత వాపోయింది. ఒక బాధ్యత గల కానిస్టేబుల్ ఇలా చేస్తే నా లాంటి సామాన్య మహిళ పరిస్థితి ఏంటి, దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుతూ వీడియో తీసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో జిల్లా వ్యాప్తంగా వైరల్ అయ్యింది. మరి దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, ఆ మహిళకు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.