డిప్యూటీ చైర్మన్‌ను కుర్చీ నుండి తోసేశారు
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక శాసనమండలి సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ, జేడీఎస్ పార్టీలు కుమ్మక్కై మండలి డిప్యూటీ చైర్మన్‌గా ధర్మగౌడను కూర్చొబెట్టారని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, సభ ప్రారంభం కావడంతోనే డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడ కూర్చిలో కూర్చున్నారు. దీంతో ధర్మగౌడపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీ నుండి లేపి కిందకు తోసేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సభ్యులు అడ్డుకునే సమయంలో […]
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక శాసనమండలి సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ, జేడీఎస్ పార్టీలు కుమ్మక్కై మండలి డిప్యూటీ చైర్మన్‌గా ధర్మగౌడను కూర్చొబెట్టారని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, సభ ప్రారంభం కావడంతోనే డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడ కూర్చిలో కూర్చున్నారు. దీంతో ధర్మగౌడపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీ నుండి లేపి కిందకు తోసేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సభ్యులు అడ్డుకునే సమయంలో సభలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్-బీజేపీ ఎమ్మెల్సీలు బాహాబాహీకి దిగారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే దుమారం రేపుతోంది.