‘దళిత బంధుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. కానీ..’

దిశ, గజ్వేల్ : తెలంగాణలో దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండాలన్న ఉద్దేశంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు పిలుపు నిచ్చారు. ఈ నెల 17న గజ్వేల్ పట్టణంలో టీపీసీసీ నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ సభాస్థలిని శనివారం కాంగ్రెస్‌ నాయకుల బృందం పరిశీలించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల […]

Update: 2021-09-11 08:08 GMT
‘దళిత బంధుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. కానీ..’
  • whatsapp icon

దిశ, గజ్వేల్ : తెలంగాణలో దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండాలన్న ఉద్దేశంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు పిలుపు నిచ్చారు. ఈ నెల 17న గజ్వేల్ పట్టణంలో టీపీసీసీ నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ సభాస్థలిని శనివారం కాంగ్రెస్‌ నాయకుల బృందం పరిశీలించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా విస్మరించారన్నారు. ఒక హుజురాబాద్‌లోనే దళిత బంధు ఎందుకని వారు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా దళిత గిరిజనుల కోసం చేసింది శూన్యమన్నారు. దళిత బంధును కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించడం లేదని, హుజురాబాద్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి గీతారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News