ఎన్‌కౌంటర్ సరే.. దూబె వెనక ఉన్నోళ్ల సంగతేంటి

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే ఎన్‌కౌంట‌ర్‌పై కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. రాజ‌కీయ నాయకులు, నేర‌గాళ్లు క‌లిసి రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విష‌యం ఈ కాన్పూర్ కేసుతో బ‌య‌ట‌ప‌డింద‌ని ఆరోపించారు. వికాస్ దుబేను ఈ స్థాయిలో పెంచి పోషించింది ఎవ‌ర‌న్న‌ది తేలాల‌ని డిమాండ్ చేశారు. అత‌డి వెనుక ఉన్న రాజ‌కీయ శ‌క్తులు ఎవ‌ర‌నేది ప్ర‌జ‌ల‌కు తెలియాల‌న్నారు. నేర‌గాడి […]

Update: 2020-07-10 06:22 GMT

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దుబే ఎన్‌కౌంట‌ర్‌పై కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. రాజ‌కీయ నాయకులు, నేర‌గాళ్లు క‌లిసి రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విష‌యం ఈ కాన్పూర్ కేసుతో బ‌య‌ట‌ప‌డింద‌ని ఆరోపించారు. వికాస్ దుబేను ఈ స్థాయిలో పెంచి పోషించింది ఎవ‌ర‌న్న‌ది తేలాల‌ని డిమాండ్ చేశారు. అత‌డి వెనుక ఉన్న రాజ‌కీయ శ‌క్తులు ఎవ‌ర‌నేది ప్ర‌జ‌ల‌కు తెలియాల‌న్నారు. నేర‌గాడి (వికాస్ దుబే)ని చంపేశార‌ని, అయితే అత‌డు చేసిన నేరాలు, వాటి వెనక ఉన్నవాళ్లు ఎవ‌రు, అత‌డి ప్రొటెక్ట్ చేస్తూ వ‌చ్చిందెవ‌ర‌న్న విష‌యాల‌ను తేల్చాల‌ని ప్రియాంక ప్రశ్నించారు. ఈ మొత్తం కేసుపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జ‌డ్జి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వీడియోను ట్విట్ట‌ర్‌లో ఆమె పోస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌ను బీజేపీ అపరాధ్ ప్రదేశ్‌గా మార్చేసింద‌ని, రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయ‌ని అన్నారు. పిల్లలపై, దళితులు, మహిళలపై దాడుల్లో, మార‌ణాయుధాలు, హ‌త్య‌ల్లో యూపీ నెంబర్ 1 గా ఉందని అన్నారు. రాష్ట్రంలో వికాస్ దుబే వంటి నేరగాళ్ల సామ్రాజ్యం నడుస్తోందని, అత‌డి ర‌క్ష‌ణ క‌ల్పించింది రాజ‌కీయ నాయ‌కులేన‌ని దేశం మొత్తానికి తెలుస‌ని ప్రియాంక చెప్పారు. నేర‌గాళ్ల‌కు, రాజ‌కీయ నేత‌ల‌కు మ‌ధ్య ఉన్న సంబంధాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని, ఇందుకోసం దుబే వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని అన్నారు.

Tags:    

Similar News