కాళేశ్వరం పనుల్లో భారీ అవినీతి: నాగం
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీ అవినీతి జరిగిందని, కానీ ప్రభుత్వం, అధికారులు తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి విమర్శించారు. పలు అంశాలపై ఆర్టీఐ నివేదికలతో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అక్రమానికి ఇరిగేషన్ ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు వత్తాసు పలుకుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 6,8,10, 11 లిప్ట్ ప్యాకేజీలకు సంబంధించిన ఈఅండ్ఎం, పంపులు, మోటార్ల పనుల్లో అవినీతి జరిగినట్లు తేలిందని, […]
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీ అవినీతి జరిగిందని, కానీ ప్రభుత్వం, అధికారులు తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి విమర్శించారు. పలు అంశాలపై ఆర్టీఐ నివేదికలతో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అక్రమానికి ఇరిగేషన్ ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు వత్తాసు పలుకుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 6,8,10, 11 లిప్ట్ ప్యాకేజీలకు సంబంధించిన ఈఅండ్ఎం, పంపులు, మోటార్ల పనుల్లో అవినీతి జరిగినట్లు తేలిందని, దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించినట్లు వెల్లడించారు. ఈ నాలుగు ప్యాకేజీల్లో కేవలం రూ. 1686.59 కోట్ల పనులు చేస్తే అగ్రిమెంట్ వాల్యూగా రూ. 7,348.81 కోట్లు చూపించి బిల్లులు చేసుకున్నారన్నారు.
అగ్రిమెంట్ ధరలు, వాస్తవ ధరలకు మధ్య రూ. 5662.22 కోట్ల వ్యత్యాసం ఉందని, ఇది కచ్చితంగా అవినీతేనన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారం ప్రకారం ప్యాకేజీ 6లో అగ్రిమెంట్ ప్రకారం రూ. 2,251.25 కోట్లు ఉందని, కానీ బీహెచ్ఈఎల్ నుంచి మోటర్లకు రూ. 530.92 కోట్లు మాత్రమే ఉందని, ప్యాకేజీ 8లో అగ్రిమెంట్ విలువ రూ. 2548.07 కోట్లు ఉందని, బీహెచ్ఈఎల్ నుంచి రూ. 52.15 కోట్లు ఉందని, ప్యాకేజీ 10లో అగ్రిమెంట్ వాల్యూ రూ. 1117.84 కోట్లు చూపించారని, బీహెచ్ఈఎల్ సరఫరాలో మాత్రం రూ. 305.72 కోట్లు ఉందని, ప్యాకేజీ 11లో రూ. 1431.65 కోట్ల అగ్రిమెంట్ ఉంటే బీహెచ్ఈఎల్ మాత్రం 320.80 కోట్లు చూపించినట్లు వివరించారు. కేవలం ఈ నాలుగు ప్యాకేజీల్లోనే పంపులు, మోటార్ల కొనుగోళ్లలో రూ. 5వేలకుపైగా అవినీతి జరిగిందని స్పష్టం కనిపిస్తుందని, కానీ ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకుంటున్న ఇంజినీర్లు అవినీతి జరుగులేదనడం బుకాయిస్తున్నారని నాగం ఆరోపించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని నాగం సవాల్ విసిరారు.