ఆర్టీసీ కార్మికులకు 50 శాతం వేతనాలు పెంచాలి

దిశ, భువనగిరి: కరోనా కష్ట సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి.. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహించిన ఆర్టీసీ కార్మికులకు 50 శాతం వేతనాలు పెంచాలని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. గురువారం యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర ఉద్యోగులకు 30 శాతం పెంచిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మరిచిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పనిగంటలు 12 గంటల నుంచి 15 గంటలకు, 350 కి.మీ నుంచి 500 కి.మీటర్లకు పెంచారు […]

Update: 2021-06-17 08:51 GMT

దిశ, భువనగిరి: కరోనా కష్ట సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి.. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహించిన ఆర్టీసీ కార్మికులకు 50 శాతం వేతనాలు పెంచాలని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. గురువారం యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర ఉద్యోగులకు 30 శాతం పెంచిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మరిచిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పనిగంటలు 12 గంటల నుంచి 15 గంటలకు, 350 కి.మీ నుంచి 500 కి.మీటర్లకు పెంచారు కానీ.. వేతనాలు పెంచడంలో మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. కరోనా సమయంలో ఇన్సెంటివ్ పెంచి కుటుంబసభ్యులలాగా చూసుకుంటా అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అసలే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు 50 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News