హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
దిశ ప్రతినిధి , హైదరాబాద్: క్రికెట్ సెలక్షన్‌లో అవకతవకలకు పాల్పడుతున్న హెచ్.సీ.ఏ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అల్ అఖిల భారత షెడ్యూల్ కులాల , తెగల సంఘాల సమైఖ్య గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సమైఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ మాట్లాడుతూ… విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీకి టీమ్ ఎంపికలో ప్రతిభను పరిగణలోకి తీసుకోకుండా, ఇష్టం వచ్చిన వారిని ఎంపిక చేశారంటూ ఆరోపించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా […]

దిశ ప్రతినిధి , హైదరాబాద్: క్రికెట్ సెలక్షన్‌లో అవకతవకలకు పాల్పడుతున్న హెచ్.సీ.ఏ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అల్ అఖిల భారత షెడ్యూల్ కులాల , తెగల సంఘాల సమైఖ్య గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సమైఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ మాట్లాడుతూ… విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీకి టీమ్ ఎంపికలో ప్రతిభను పరిగణలోకి తీసుకోకుండా, ఇష్టం వచ్చిన వారిని ఎంపిక చేశారంటూ ఆరోపించారు.
అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ నేతృత్వంలో ఈ అవకతవకలు జరుగుతున్నాయని, ఏ సెలెక్షన్ ఉన్న కలెక్షన్ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని కమిషన్‌కు వివరించారు. హెచ్‌సీసీ ఎంపిక చేసిన జట్టును తక్షణమే రద్దు చేసి, లోదా కమిషన్ సిఫార్సుల మేరకు కొత్త జట్టును ఎంపిక చేయాలని , హెచ్.సి.ఏ అవకతవకలపై విచారణకు ఆదేశించాలని హెచ్చార్సీని మహేశ్వర్ రాజ్ కోరారు.