సీఎం జగన్‌పై నెల్లూరులో ఫిర్యాదు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవలే విడుదల చేసిన జాబ్ క్యాలండర్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్, సీఎం పదవి చేపట్టిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేశారని ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా కేంద్రంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను సీఎం జగన్ మోసం చేశారంటూ ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవలే విడుదల చేసిన జాబ్ క్యాలండర్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్, సీఎం పదవి చేపట్టిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేశారని ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా కేంద్రంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను సీఎం జగన్ మోసం చేశారంటూ ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నెల్లూరు నగర అధ్యక్షులు ఆషిక్, తదితరులు పాల్గొన్నారు.