కంపెనీలు ఇలా.. సెబీ ఎలా?
దిశ, సెంట్రల్ డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను వాయిదా వేయడం.. లేకపోతే సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో విలీనం చేసేలా అనుమతి ఇవ్వాలంటూ లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ)ని కోరాయి. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధింపుతో ఏప్రిల్-మే మధ్యకాలంలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని, దీంతో అమ్మకాలు క్షీణించడంతో భారీ నష్టాలు నమోదవుతాయని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా లాక్‌డౌన్ తర్వాత స్టాక్ ధరలు భారీగా క్షీణిస్తున్నందునా ప్రిఫరెన్షియల్ […]
దిశ, సెంట్రల్ డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను వాయిదా వేయడం.. లేకపోతే సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో విలీనం చేసేలా అనుమతి ఇవ్వాలంటూ లిస్టెడ్ కంపెనీలు మార్కెట్ నియంత్రణ సంస్థ (సెబీ)ని కోరాయి. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధింపుతో ఏప్రిల్-మే మధ్యకాలంలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని, దీంతో అమ్మకాలు క్షీణించడంతో భారీ నష్టాలు నమోదవుతాయని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా లాక్‌డౌన్ తర్వాత స్టాక్ ధరలు భారీగా క్షీణిస్తున్నందునా ప్రిఫరెన్షియల్ ఈక్విటీ ఆఫర్, ఓపెన్ ఆఫర్‌లపై నిబంధనలను సడలించాలంటూ కొన్ని ప్రముఖ కంపెనీలు సెబీని కోరాయి.
త్రైమాసికాల్లో నమోదయ్యే భారీ నష్టాలు కంపెనీల నికర విలువను, రుణాలు తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితి గతంలో ఎన్నడూ జరగలేదు. అయితే పారదర్శకత, కార్పొరేట్ పాలన ప్రమాణాలకు ప్రతికూలంగా కంపెనీల ప్రతిపాదనను సెబీ పరిశీలించాల్సి ఉంటుందని సీనియర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ దిలీప్తె చెప్పారు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లోపల తమ కంపెనీ ఫలితాలను ప్రకటించాలి. కంపెనీలు చేసిన ఈ ప్రతిపాదనపై సెబీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.