Viral : ప్రభుత్వ పాఠశాలలో మత ప్రచారం..?

దిశ, కరీంనగర్ ప్రతినిధి : కరీంనగర్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ మతానికి సంబంధించిన పాటలతో ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా దుర్శేడ్ ప్రభుత్వ పాఠశాలలో మత ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆజాద్‌కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఏసు క్రీస్తు పాటలతో ఉపాధ్యాయులు మత ప్రచారం చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చిన్నారులకు మత ప్రచారం చేసేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యులైన […]

Update: 2021-12-07 11:20 GMT

దిశ, కరీంనగర్ ప్రతినిధి : కరీంనగర్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ మతానికి సంబంధించిన పాటలతో ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా దుర్శేడ్ ప్రభుత్వ పాఠశాలలో మత ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆజాద్‌కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఏసు క్రీస్తు పాటలతో ఉపాధ్యాయులు మత ప్రచారం చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చిన్నారులకు మత ప్రచారం చేసేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News