తెలుగు అకాడమీ స్కాం.. ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధులు గోల్​ మాల్​ పై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అవుట్​ సోర్సింగ్​ సిబ్బందితో లావాదేవీలు, కీలకమైన బ్యాంకు ఖాతాలను నిర్వహించే పనిని అప్పగించడంతోనే తప్పిదాలు జరిగినట్టు కమిటీ స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్​, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు పలు విషయాలను ప్రస్తావిస్తూ నివేదికలో పొందుపరిచారు. అయితే ఇప్పటికే అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి సహా […]

Update: 2021-10-05 21:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధులు గోల్​ మాల్​ పై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అవుట్​ సోర్సింగ్​ సిబ్బందితో లావాదేవీలు, కీలకమైన బ్యాంకు ఖాతాలను నిర్వహించే పనిని అప్పగించడంతోనే తప్పిదాలు జరిగినట్టు కమిటీ స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్​, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు పలు విషయాలను ప్రస్తావిస్తూ నివేదికలో పొందుపరిచారు. అయితే ఇప్పటికే అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి సహా అధికారులు, సిబ్బందిని, బ్యాంకు అధికారులను విచారించిన కమిటీ వారి నుంచి పలు ముఖ్యమైన సమచారాన్ని సేకరించి నివేదికలో పేర్కొన్నారు.

6 రోజుల పాటు విచారణ..

ఇక అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని మూడు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. మరో ముగ్గురు నిందితులు సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్‌ల కస్టడీపై తీర్పును గురువారానికి వాయిదా వేసింది. మస్తాన్ వలీని బుధవారం నుంచి 6 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. యూనియన్ బ్యాంకు నుంచి డిపాజిట్లను ఏ విధంగా మళ్లించారనే దానిపై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి విచారించనున్నారు. ఈ డిపాజిట్ల గోల్ మాల్ వెనుక ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలు తెలుసుకునేందుకు సుదీర్ఘంగా ఎంక్వైరీ చేయనున్నారు.


Similar News