రాబోయే రోజులు కరోనా రోగులకు డేంజరే
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 69 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో మొదట అత్యధికంగా కేసులు నమోదైన ఢిల్లీలో క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే, గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక చలికాలంలో ఢిల్లీలో కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ హెచ్చరించింది. దీనికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ప్రభుత్వానికి అందజేసింది. ఢిల్లీలో శీతాకాలంలో రోజుకు […]
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 69 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో మొదట అత్యధికంగా కేసులు నమోదైన ఢిల్లీలో క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే, గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక చలికాలంలో ఢిల్లీలో కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ హెచ్చరించింది. దీనికి సంబంధించిన రిపోర్టును ఢిల్లీ ప్రభుత్వానికి అందజేసింది.
ఢిల్లీలో శీతాకాలంలో రోజుకు 15వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఎన్సీడీసీ తన రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యానికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శ్వాససంబంధమైన వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. చాట్ పూజ, దసరా, దీపావళి, ఈద్, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు ఢిల్లీలో ఎక్కువగా ప్రజలు ఒకచోట చేరుతుంటారు. దీంతో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతాయని ఎన్సీడీసీ హెచ్చరించింది. ఎన్సీడీసీ సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.