అవసరం ఉంటేనే బయటకు రండి.. ఇది పోలీసుల హెచ్చరిక
దిశ, డైనమిక్ బ్యూరో: గులాబ్ తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ప్రజలకు హెచ్చరిస్తూ.. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు బయటకు రాకపోవడమే మంచిదని.. వరద నీటి ప్రవాహం భారీ […]
దిశ, డైనమిక్ బ్యూరో: గులాబ్ తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ప్రజలకు హెచ్చరిస్తూ.. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు బయటకు రాకపోవడమే మంచిదని.. వరద నీటి ప్రవాహం భారీ స్థాయిలో ఉందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డయల్ 100కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలోని పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. ఇందుకోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 040 23202813 కి కాల్ చేసి తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.