కేసారంలో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు
దిశ, వెబ్ డెస్క్: కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకుముందు సూర్యాపేటలోని విద్యానగర్ నుంచి ఆర్మీ ప్రత్యేక వాహనంలో సంతోష్ బాబు అంతిమయాత్ర నిర్వహించింది. సూర్యాపేటకు పక్కనే ఉన్న కేసారం గ్రామం వరకు సుమారు రెండుగంటలపాటు ఈ అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం కేసారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాల ప్రకారం సంతోష్ బాబు అంత్యక్రియలు జరిపారు. ఈ సమయంలో ఆర్మీ, పోలీసులు ప్రత్యేక వందనం సమర్పించారు. అయితే.. కరోనా దృష్ట్యా అంత్యక్రియలు జరిగే చోటకు […]
దిశ, వెబ్ డెస్క్: కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకుముందు సూర్యాపేటలోని విద్యానగర్ నుంచి ఆర్మీ ప్రత్యేక వాహనంలో సంతోష్ బాబు అంతిమయాత్ర నిర్వహించింది. సూర్యాపేటకు పక్కనే ఉన్న కేసారం గ్రామం వరకు సుమారు రెండుగంటలపాటు ఈ అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం కేసారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాల ప్రకారం సంతోష్ బాబు అంత్యక్రియలు జరిపారు. ఈ సమయంలో ఆర్మీ, పోలీసులు ప్రత్యేక వందనం సమర్పించారు. అయితే.. కరోనా దృష్ట్యా అంత్యక్రియలు జరిగే చోటకు కొద్దిమందిని మాత్రమే అనుమతించారు. ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులు, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు. అంతకుముందు నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున సంతోష్ బాబు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమవుతూ చివరిసారిగా వీడ్కోలు పలికారు. దారి వెంటా పువ్వులు చల్లుతూ.. జై జవాన్, జోహర్ సంతోష్ బాబు అంటూ ఘనంగా నివాళులర్పించారు.