జూన్ 1 నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

దిశ, మేడ్చల్: చెత్తా చెదారం.. మురుగునీరు లేకుండా మేడ్చల్ జిల్లాను పరిశుభ్రంగా తయారు చేయాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జూన్ 1వ తేదీ నుంచి 8 వరకూ నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంపై డీపీఓ, ఎంపీడీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ.. గ్రామల్లో చెత్త చెదారం లేకుండా తొలగించాలని, రోడ్లను శుభ్రం చేయాలని, పైపులైన్ లీకేజీలను గుర్తించి సరి చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను […]

Update: 2020-05-30 07:07 GMT

దిశ, మేడ్చల్: చెత్తా చెదారం.. మురుగునీరు లేకుండా మేడ్చల్ జిల్లాను పరిశుభ్రంగా తయారు చేయాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జూన్ 1వ తేదీ నుంచి 8 వరకూ నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంపై డీపీఓ, ఎంపీడీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ.. గ్రామల్లో చెత్త చెదారం లేకుండా తొలగించాలని, రోడ్లను శుభ్రం చేయాలని, పైపులైన్ లీకేజీలను గుర్తించి సరి చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరు చేసి, డంపింగ్ యార్డుకు తరలించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పచ్చదనం కోసం మొక్కలు, పెంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి, ముందుగానే గుంతలను తవ్వుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించి దోమల నివారణకు గుంతల్లో నీరు తొలగించి ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనులు చేపట్టి గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతిరోజూ కరోనా నివారణా చర్యలు చేపట్టడం, మాస్కులు, భౌతికదూరం, చేతులు శుభ్రం చేయడం లాంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News