నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి

దిశ, భువనగిరి: వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లు, పంటలు, చెరువులు, కుంటలపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తక్షణమే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. సోమవారం గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అలుగు పారుతున్న చెరువులను గుర్తించి గండ్లు పడితే వెంటనే పూడ్చివేత చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల వారీగా పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. కొవిడ్-19 పై సమీక్షిస్తూ మండలాల వారీగా పాజిటివ్ కేసులతో ప్రాథమిక […]

Update: 2020-08-17 09:00 GMT

దిశ, భువనగిరి: వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లు, పంటలు, చెరువులు, కుంటలపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తక్షణమే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. సోమవారం గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అలుగు పారుతున్న చెరువులను గుర్తించి గండ్లు పడితే వెంటనే పూడ్చివేత చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల వారీగా పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు.

కొవిడ్-19 పై సమీక్షిస్తూ మండలాల వారీగా పాజిటివ్ కేసులతో ప్రాథమిక సంబంధాలున్న వ్యక్తులను నాలుగు రోజుల తర్వాత పరీక్షించి 17రోజుల పాటు క్వారంటైన్ ఉంచేందుకు మండల స్థాయి ఆరోగ్యశాఖ సిబ్బంది, వీఆర్ఏలు, చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ కేసులు ఉన్నవారు పబ్లిక్ ప్రదేశాల్లో తిరగకుండా చూడాలని, ఒకవేళ తిరిగితే సమాచారాన్ని వెంటనే గ్రామ సర్పంచ్, వీఆర్ఏల ద్వారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తెలియజేయాలన్నారు.

జిల్లాలో హాట్‌స్పాట్‌గా ఉన్న భువనగిరి, చౌటుప్పల్, ఆలేరులలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మండలాల వారీగా దెబ్బతిన్న ఇండ్లు, చెరువులు, కుంటలపై నివేదికలు అందజేయాలన్నారు. ఎరువుల లభ్యత, పంచాయితీ, ఆర్‌అండ్‌బీ రోడ్లలో మురుగు నీరు నిల్వకుండా, మున్సిపాలిటీ వారిగా క్లోరినేషన్, బ్లీచింగ్, చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News