లోతట్టు ప్రాంతాలలో నిఘా పెంచాలి
దిశ, సూర్యాపేట: గత కొన్న రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుడా, మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టరేట్‌లో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా జిల్లా మొత్తం వాగులు, వంకలు, చెరువులు నిండి […]
దిశ, సూర్యాపేట: గత కొన్న రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుడా, మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా కలెక్టరేట్‌లో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా జిల్లా మొత్తం వాగులు, వంకలు, చెరువులు నిండి అలుగు పోస్తున్నాయని, దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర సేవలకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్‌లు 9849907765, 08684-220049లకు ఫోన్ చేయాలని కోరారు. ఇప్పటికే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి, అన్ని ప్రాంతాల పై నిఘా ఉంచామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.