అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములు.. కలెక్టర్ రియల్ చెక్ ప్రోగ్రాం
దిశ, వరంగల్: అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ఆదేశించారు. సోమవారం కాటారం ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ రియల్ చెక్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశ పెడుతోందన్నారు. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు అయితే జిల్లాలో పేదరికాన్ని […]
దిశ, వరంగల్: అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ఆదేశించారు. సోమవారం కాటారం ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ రియల్ చెక్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశ పెడుతోందన్నారు. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు అయితే జిల్లాలో పేదరికాన్ని నిర్మూలించవచ్చనే సంకల్పంతో జిల్లాలో రియల్ చెక్ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం, పని తీరులో పారదర్శకత పెరుగుతోందన్నారు. పంచాయతీ రాజ్ చట్టం గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇచ్చిందని, ఈ అధికారాలను ఉపయోగించుకుని గ్రామాల సంపూర్ణ అభివృద్ధి సర్పంచ్ నేతృత్వంలో జరగాలన్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారుల సహకారంతో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి గ్రామపంచాయతీలో తీర్మానం చేసి ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గుడుంబా మహమ్మారిని జిల్లా నుంచి పూర్తిగా తరిమి వేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సమిష్టిగా పని చేయాలన్నారు. ఆస్పత్రులకు వచ్చే బాలింతలు, గర్భిణీలకు ఒక పూట ఆహారం అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలని, అంగన్‌వాడీ భవనాలు లేని గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మాణానికి చర్యలు చేపడతామనన్నారు.