14 నుంచి రైతులకు అందుబాటులో ఎరువులు

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వర్షాకాలం పంట కోసం ఈ నెల 14 నుంచి ఎరువులు, విత్తనాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, సహకార, మార్క్‌ఫెడ్ శాఖల అధికారులతో ఎరువులు, విత్తనాల పంపిణీ, గోడౌన్లలో నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. వర్షాకాలం సాగుకు 2.33 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని, వాటి సరఫరా కోసం రూపొందించిన […]

Update: 2020-05-06 10:20 GMT
14 నుంచి రైతులకు అందుబాటులో ఎరువులు
  • whatsapp icon

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వర్షాకాలం పంట కోసం ఈ నెల 14 నుంచి ఎరువులు, విత్తనాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, సహకార, మార్క్‌ఫెడ్ శాఖల అధికారులతో ఎరువులు, విత్తనాల పంపిణీ, గోడౌన్లలో నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. వర్షాకాలం సాగుకు 2.33 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని, వాటి సరఫరా కోసం రూపొందించిన ప్రణాళిక గురించి వ్యవసాయ శాఖ జేడీ కలెక్టర్‌కు వివరించారు. ఈ సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో పత్తి, 3 లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో పప్పు దినుసులు సాగు కానున్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ రెండో వారం నుంచి సాగు ప్రారంభం కానుండగా, రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు మే 14 నుంచి అందజేయాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు విక్రయించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, వీ చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం సునీత, జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీనివాసమూర్తి, వ్యవసాయ శాఖ ఏడీలు, సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

Tags: may 14, all seeds available to farmers, collector prashanth jeevan patil

Tags:    

Similar News