రైతు వేదికల నిర్మాణాలు వేగవంతం చేయాలి

దిశ, పటాన్‌చెరు: రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. పటాన్‌చెరు మండలంలోని నందిగామ, కర్దానూర్, పెద్దకంజర్ల లో కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా రైతు వేదికల పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలనీ, పనులు నాణ్యతగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా రైతు వేదికలను పూర్తిచేసి జిల్లాను ప్రథమ […]

Update: 2020-09-23 06:34 GMT
రైతు వేదికల నిర్మాణాలు వేగవంతం చేయాలి
  • whatsapp icon

దిశ, పటాన్‌చెరు:
రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. పటాన్‌చెరు మండలంలోని నందిగామ, కర్దానూర్, పెద్దకంజర్ల లో కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా రైతు వేదికల పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలనీ, పనులు నాణ్యతగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా రైతు వేదికలను పూర్తిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. త్వరిత గతిన పనులు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

Tags:    

Similar News