గంజాయి‌తో పట్టుపడిన సర్పంచ్.. కలెక్టర్ ఏం చేశారంటే?

దిశ, నారాయణ్ ఖేడ్ : నిషేధిత గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుపడిన సర్పంచ్‌ను పదవీ బాధ్యతల నుండి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తొలగించారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్‌కు ఈ నెల 13న సంగారెడ్డి జిల్లా సిర్లాపూర్ మండలంలోని గరిడేగావ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండా బాలాజీ గంజాయి రవాణా చేస్తూ పట్టుపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొండా బాలాజీని […]

Update: 2021-10-23 05:40 GMT

దిశ, నారాయణ్ ఖేడ్ : నిషేధిత గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుపడిన సర్పంచ్‌ను పదవీ బాధ్యతల నుండి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తొలగించారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్‌కు ఈ నెల 13న సంగారెడ్డి జిల్లా సిర్లాపూర్ మండలంలోని గరిడేగావ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండా బాలాజీ గంజాయి రవాణా చేస్తూ పట్టుపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొండా బాలాజీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప సర్పంచ్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు.

Tags:    

Similar News