వ్యాక్సిన్ పక్కదారి.. విచారణకు కలెక్టర్ ఆదేశం
దిశప్రతినిధి, వరంగల్ : వ్యాక్సిన్ పక్కదారి పడుతోంది. సూపర్‌స్ప్రెడర్లకు కాకుండా అధికారుల బంధువులకు, వారి స్నేహితులకు అందేలా కొంతమంది వక్రబుద్ధిని ప్రదర్శించినట్లుగా వెలుగులోకి వస్తోంది. టీకాల టోకెన్ల మంజూరులో అన్నీ తామై వ్యవహరిస్తూ అనర్హులకు దగ్గరుండి మరీ టీకా వేయించారని సమాచారం. సూపర్ స్ప్రెడర్లుగా ప్రభుత్వం గురించిన ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్ డెలివరీ బాయ్స్, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవారినంతా కూడా సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించింది. […]
దిశప్రతినిధి, వరంగల్ : వ్యాక్సిన్ పక్కదారి పడుతోంది. సూపర్‌స్ప్రెడర్లకు కాకుండా అధికారుల బంధువులకు, వారి స్నేహితులకు అందేలా కొంతమంది వక్రబుద్ధిని ప్రదర్శించినట్లుగా వెలుగులోకి వస్తోంది. టీకాల టోకెన్ల మంజూరులో అన్నీ తామై వ్యవహరిస్తూ అనర్హులకు దగ్గరుండి మరీ టీకా వేయించారని సమాచారం. సూపర్ స్ప్రెడర్లుగా ప్రభుత్వం గురించిన ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్ డెలివరీ బాయ్స్, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవారినంతా కూడా సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించింది. వీరందరికీ ప్రత్యేకంగా టోకెన్లను అందజేసింది. అయితే ఇక్కడే అధికారులు లీలలు చూపినట్లుగా తెలుస్తోంది. అధికారులు తమ బంధువులను, స్నేహితులను, కుటుంబీకులను సూపర్‌స్ప్రెడర్ల జాబితాలో చేర్చి టీకా అందేలా చేయడం గమనార్హం.
వీధి వ్యాపారులు.. పెట్రోల్ బంకులు
అధికారులు తమకు తెలిసిన వారిని వీధి వ్యాపారుల జాబితాలో చేర్చి టోకెన్ మంజూరయ్యేలా సంబంధిత సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే విధంగా జరిగినట్లుగా తెలుస్తోంది. కూరగాయల వ్యాపారులుగా, పెట్రోల్ బంకు సిబ్బందిగా, బ్యాంకు సిబ్బందిగా ఎలా పడితే అలా పేర్కొంటూ మొత్తానికి టీకా అందేలా టోకెన్ చిక్కేలా అధికారులు పైరవీలు జరిపినట్లుగా తెలుస్తోంది. వరంగల్ అర్భన్ జిల్లాలో దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందిన పట్టించుకోవడం లేదు. సూటు బూటు వేసుకుని వచ్చి కూరగాయల వ్యాపారుల మంటూ వచ్చి క్యూలో నిల్చున్నారని, టీకాలు వేయించుకుంటున్న నిజమైన వ్యాపారులు పేర్కొంటుండటం గమనార్హం.
డీఏఓకు షాక్ ఇచ్చిన కలెక్టర్ గౌతమ్..
డోర్నకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సూపర్ స్పైడర్స్ శుక్రవారం టీకా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఇందులో అగ్రికల్చర్, రేషన్ డీలర్లు, రోడ్డు సైడ్వెండర్స్కు టీకా ఇవ్వాల్సి ఉండేది. అయితే పై జాబితాలోని ఏ వర్గానికి చెందని ఓ యువతి టీకా సెంటర్‌లో కనిపించడంతో ఎవరూ అంటూ కలెక్టర్ గౌతమ్ స్వయంగా అధికారులను ఆరా తీశారు. అధికారుల ఇన్వాల్వ్‌మెంట్ ఉందనే అనుమానంతో ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డీవో కొమరయ్యకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన ఆర్డీవో శుక్రవారం సాయంత్రం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్‌కు షోకాజ్ మెమో జారీ చేశారు. అయితే, అగ్రికల్చర్శాఖకు సంబంధించిన ఓ ఉద్యోగి తన అన్న కూతురని టీకా వేసేందుకు ఇక్కడికి తీసుకోవచ్చారని ప్రాథమికంగా తెలుస్తోంది.