కలెక్టర్ జోక్యంతో కూలిన గోడలు

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో ఆ జిల్లాతో తమిళనాడు సరిహద్దును కలుపుతూ ఉన్న రహదారులపై తమిళనాడు వాసులు గోడలు నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పలమనేరు – గుడియాత్తం, సంగమంగళం – వేలూరు, చిత్తూరు – తిరుత్తణి మార్గాల్లోని సరిహద్దుల వద్ద తమిళనాడు అధికారులు గోడలను నిర్మించగా, ఈ వార్త మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా రంగంలోకి దిగి, ఈ అడ్డుగోడల వద్ద […]

Update: 2020-04-28 00:28 GMT

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో ఆ జిల్లాతో తమిళనాడు సరిహద్దును కలుపుతూ ఉన్న రహదారులపై తమిళనాడు వాసులు గోడలు నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పలమనేరు – గుడియాత్తం, సంగమంగళం – వేలూరు, చిత్తూరు – తిరుత్తణి మార్గాల్లోని సరిహద్దుల వద్ద తమిళనాడు అధికారులు గోడలను నిర్మించగా, ఈ వార్త మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా రంగంలోకి దిగి, ఈ అడ్డుగోడల వద్ద ఇరు రాష్ట్రాల రైతులూ ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు అధికారులకు వివరించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వెంటనే గోడలు ఈ మూడు ప్రాంతాల్లో నిర్మించిన గోడలను కూల్చి వేశారు.

Tags: chittoor district, ap, tamil nadu, corona virus fear, walls on roads, border walls

Tags:    

Similar News