రాష్ట్రంలో మళ్లీ పంజా విసురుతున్న చలి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్టంలో ఈశాన్య శీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం ఉష్ణోగ్రతలు 5.7 డిగ్రీలకు, మంగళవారం ఉదయం వరకు 6 డిగ్రీలకు క్షీణించాయి. తెలంగాణ 33 జిల్లాల సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.7 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.8 డిగ్రీలుగా నమోదైనట్టు తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆర్లిలో 6, బోథ్ మండలం సోనాలలో 6, […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్టంలో ఈశాన్య శీతల గాలుల ప్రభావంతో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం ఉష్ణోగ్రతలు 5.7 డిగ్రీలకు, మంగళవారం ఉదయం వరకు 6 డిగ్రీలకు క్షీణించాయి. తెలంగాణ 33 జిల్లాల సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.7 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.8 డిగ్రీలుగా నమోదైనట్టు తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆర్లిలో 6, బోథ్ మండలం సోనాలలో 6, రాష్ర్టంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో ఉష్ణోగ్రత 6.5 డిగ్రీలు, సిరిపూర్(యూ)లో 6.8, కామారెడ్డి జిల్లా పిట్లంలో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.7–15 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. నిర్మల్, సంగారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీంతో చలి పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురం 34.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ర్టంలోని ఒకటి రెండుచోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, ఎలాంటి వర్ష సూచనలు లేవని వాతావారణశాఖాధికారులు తెలిపారు.