ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు ప్రకటించిన ఐటీ కంపెనీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ భారీగా ఉద్యోగాలివ్వనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఏడాదిలో 1.30 లక్షల మంది కొత్తవారిని తీసుకోనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థలో అట్రిషన్ రేటు (attrition rate) అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, లక్ష మంది కొత్తవారితో పాటు కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 30 వేల మంది ఫ్రెషర్లను కూడా తీసుకోనున్నట్టు కంపెనీ వెల్లడించింది. కొత్త డిజిటల్ నైపుణ్యాలలో 95 వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు కంపెనీ […]

Update: 2021-07-29 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ భారీగా ఉద్యోగాలివ్వనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఏడాదిలో 1.30 లక్షల మంది కొత్తవారిని తీసుకోనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థలో అట్రిషన్ రేటు (attrition rate) అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, లక్ష మంది కొత్తవారితో పాటు కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 30 వేల మంది ఫ్రెషర్లను కూడా తీసుకోనున్నట్టు కంపెనీ వెల్లడించింది. కొత్త డిజిటల్ నైపుణ్యాలలో 95 వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు కంపెనీ వివరించింది. వచ్చే ఏడాదిలో ఫ్రెషర్ల సంఖ్యను 45 వేలకు పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది.

“ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను అందుకున్నాం. పెట్టుబడుల లక్ష్యాలను తగినట్టుగా ఆధునిక వ్యాపారాన్ని నిర్మించేందుకు కంపెనీ సామర్థ్యంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో విస్తరించాలని భావిస్తున్నాం. దీనివల్ల కాగ్నిజెంట్ సంస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్టు” కాగ్నిజెంట్ సీఈఓ బ్రెయిన్ హంఫ్రీస్ చెప్పారు. కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కాగ్నిజెంట్ సంస్థ భారీగా లాభాలను నమోదు చేసింది. నికర ఆదాయం 41.8 శాతం వృద్ధితో 512 బిలియన్ డాలర్లు (రూ. 3,801.7 కోట్లు)ను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికం అసాధారణంగా ఉందని, కొవిడ్ సెకెండ్ వేవ్ సహా అనేక సవాళ్ల మధ్య కంపెనీ ఆదాయం పెరగిందని, 2015 తర్వాత అత్యధిక త్రైమాసిక ఆదాయమని కాగ్నిజెంట్ డిజిటల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ అధ్యక్షుడు, ఛైర్మన్ రాజేస్ అబ్రహం చెప్పారు.

Tags:    

Similar News