సమ్మె దెబ్బకు భారీగా పడిపోయిన బొగ్గు ఉత్పత్తి!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ ఇండియా మూడు రోజుల పాటు చేసిన సమ్మె కారణంగా భారీగా ఉత్పత్తి పడిపోయింది. జూన్ ఉత్పత్తి సగటు ఒకరోజుకు 1.29 మిలియన్ టన్నులు కాగా, 5.73 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. మూడు రోజులకు గాను 5,73,000 టన్నులకు ఉత్పత్తి క్షీణించింది. గత వారం 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ కోల్ ఇండియా కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెలో సంస్థ […]

Update: 2020-07-06 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ ఇండియా మూడు రోజుల పాటు చేసిన సమ్మె కారణంగా భారీగా ఉత్పత్తి పడిపోయింది. జూన్ ఉత్పత్తి సగటు ఒకరోజుకు 1.29 మిలియన్ టన్నులు కాగా, 5.73 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. మూడు రోజులకు గాను 5,73,000 టన్నులకు ఉత్పత్తి క్షీణించింది. గత వారం 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ కోల్ ఇండియా కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెలో సంస్థ రోజూవారి సగటు ఉత్పత్తి 5.73 లక్షల టన్నులకు దిగజారింది. ఇది అంతకుముందు పది రోజుల సగటు రోజువారీ ఉత్పత్తితో పోల్చితే 56 శాతం తక్కువ.

ఇటీవల వాణిజ్య స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలను అనుమతించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికి వ్యతిరేకంగా కోల్ ఇండియా కార్మికులు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగారు. దీంతో ఉత్పత్తికి భారీగా గండిపడింది. ఇంతకుముందు కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల జూన్ నెలలో ఉత్పత్తిలో వరుసగా ముడవసారి క్షీణత నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యం ఉన్న సంస్థ.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా తక్కువ వార్షిక ఉత్పత్తి నమోదు చేసింది. ప్రైవేట్ సంస్థలకు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఈ సమ్మెలో కోల్ ఇండియాకు చెందిన మొత్తం ఐదు కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి.

Tags:    

Similar News