ATMల నిర్వహణకు సీఎంఎస్ భారీ పెట్టుబడి!

దిశ, వెబ్‌డెస్క్ : ఏటీఎం బిజినెస్, క్యాష్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో రూ. 1,300 కోట్ల పెట్టుబడులతో మరింత విస్తరించాలని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ భావిస్తోంది. ‘మొదటి విడతలో భాగంగా రూ. 180 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాం. దీనివల్ల సుమారు 2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, వీటిలో బ్లూకాలర్ ఉద్యోగాలు 70 శాతం, మిగొలిన వైట్ కాలర్ జాబ్స్ 30 శాతం వరకు ఉంటాయని’ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ వైస్ […]

Update: 2020-12-22 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏటీఎం బిజినెస్, క్యాష్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో రూ. 1,300 కోట్ల పెట్టుబడులతో మరింత విస్తరించాలని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ భావిస్తోంది. ‘మొదటి విడతలో భాగంగా రూ. 180 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాం. దీనివల్ల సుమారు 2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, వీటిలో బ్లూకాలర్ ఉద్యోగాలు 70 శాతం, మిగొలిన వైట్ కాలర్ జాబ్స్ 30 శాతం వరకు ఉంటాయని’ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ వైస్ ఛైర్మన్, హోల్‌టైం డరెక్టర్ రాజీవ్ కౌల్ చెప్పారు.

అంతర్గత వనరులు, డెబిట్ రూపంలో ఈ నిధులను సమీకరించనున్నట్టు ఆయన తెలిపారు. మొత్తంగా 3000 ఏటీఎంలను నిర్వహించడానికి ఎస్‌బీఐ నుంచి సీఎంఎస్‌కు ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే స్థలాల ఎంపిక, క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసులు, ఏటీఎంల ఏర్పాటు, రోజూవారీ నిర్వహణలను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ 7 ఏళ్లు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత అదనంగా మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంటుంది. సీఎంఎస్‌తో పాటు ఏటీఎంల నిర్వహణలో ఎస్ఐఎస్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ సంస్థలు ఉన్నాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం..సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం 1,13,981 ఆన్‌సైట్ ఏటీఎంలు, 96,068 ఆఫ్‌సైట్ ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకులు అదనంగా 3,27,620 ఏటీఎంలను కలిగి ఉన్నాయి. సీఎంఎస్ రోజుకు సుమారు రూ. 5 వేల కోట్ల నగదు లావాదేవీలను నిర్వహిస్తుండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో సీఎంఎస్ సంస్థ ఆదాయం రూ. 1,400 కోట్లుగా ఉంది.

Tags:    

Similar News