గవర్నర్ దంపతులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్, భారతి

దిశ, ఏపీ బ్యూరో : గవర్నర్ బీబీ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు పరామర్శించారు. తాడేపల్లిలోని తమ నివాసం నుంచి సీఎం జగన్ దంపతులు బుధవారం సాయంత్రం రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ దంపతులను పలకరించారు. గవర్నర్ దంపతుల ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతిలు సూచించారు. ఇకపోతే కొవిడ్‌తో తీవ్ర అనారోగ్యానికి గురైన గవర్నర్ దంపతులు గచ్చిబౌలిలోని ఏఐజీ […]

Update: 2021-12-15 07:52 GMT
cm jagan and governer
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో : గవర్నర్ బీబీ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు పరామర్శించారు. తాడేపల్లిలోని తమ నివాసం నుంచి సీఎం జగన్ దంపతులు బుధవారం సాయంత్రం రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ దంపతులను పలకరించారు. గవర్నర్ దంపతుల ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు.

కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని గవర్నర్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతిలు సూచించారు. ఇకపోతే కొవిడ్‌తో తీవ్ర అనారోగ్యానికి గురైన గవర్నర్ దంపతులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకొని విజయవాడ వచ్చాక ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లి ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News