'కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు'
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీ జూబ్లీపురం గ్రామంలో రూ.51 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేకూర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు […]
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీ జూబ్లీపురం గ్రామంలో రూ.51 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేకూర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్ర రావు, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ భూక్య సోనా, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ హనుమంతరావు, కొత్తగూడెం సొసైటీ వైస్ చైర్మన్ జగన్ తదితరులు పాల్గొన్నారు.