యోగీ సర్కార్‌పై నితీశ్‌ కుమార్ ఫైర్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వ తీరుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫైర్ అయ్యారు. లాక్‌డౌన్ కారణంగా యూపీకి చెందిన విద్యార్థులు రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయారు. దీంతో వారిని యూపీకి తీసుకెళ్లేందుకు యోగీ ప్రభుత్వం 300 బస్సులను పంపింది. ఈ విషయంపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. లాక్‌డౌన్ నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘించడం దారుణమన్నారు. కోటాలో ఉన్న విద్యార్థులంతా ఉన్నత కుటుంబాలకు చెందినవారేననీ, ఉన్నఫలంగా వారిని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తిండీతిప్పలు లేక అల్లాడుతున్న […]

Update: 2020-04-18 01:44 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వ తీరుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫైర్ అయ్యారు. లాక్‌డౌన్ కారణంగా యూపీకి చెందిన విద్యార్థులు రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయారు. దీంతో వారిని యూపీకి తీసుకెళ్లేందుకు యోగీ ప్రభుత్వం 300 బస్సులను పంపింది. ఈ విషయంపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. లాక్‌డౌన్ నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘించడం దారుణమన్నారు. కోటాలో ఉన్న విద్యార్థులంతా ఉన్నత కుటుంబాలకు చెందినవారేననీ, ఉన్నఫలంగా వారిని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తిండీతిప్పలు లేక అల్లాడుతున్న బీహార్ వలస కార్మికులను ఎందుకు స్వస్థలాకు పంపించడం లేదంటూ నిలదీశారు. ఈ విషయంపై యూపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, బీహార్‌కు చెందిన వలస కార్మికులు, విద్యార్థులు ప్రస్తుతం వారు ఉంటున్న చోటనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ర్టాల్లో చిక్కుకున్న బీహార్ వాసుల యోగ క్షేమాల గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నట్లు నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.

Tags: bihar cm nitish kumar, lock down, rajasthan, students

Tags:    

Similar News