రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్

దిశ, వెబ్‌డెస్క్: భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లనున్నారు. రేపు రోడ్డు మార్గంలో ఆయన సూర్యాపేటకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి రూ. 5 కోట్ల చెక్కు, 5 వందల గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు, గ్రూప్ 1 స్థాయి (డిప్యూటీ కలెక్టర్) ఉద్యోగానికి సంబంధించిన పోస్టింగ్ లెటర్‌ను అమర జవాన్ సతీమణికి అందజేయనున్నారు. ఈ పర్యటన(కల్నల్ […]

Update: 2020-06-21 12:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లనున్నారు. రేపు రోడ్డు మార్గంలో ఆయన సూర్యాపేటకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి రూ. 5 కోట్ల చెక్కు, 5 వందల గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు, గ్రూప్ 1 స్థాయి (డిప్యూటీ కలెక్టర్) ఉద్యోగానికి సంబంధించిన పోస్టింగ్ లెటర్‌ను అమర జవాన్ సతీమణికి అందజేయనున్నారు. ఈ పర్యటన(కల్నల్ కుటుంబం వద్దకు)లో తనను కలవడానికి ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా రావొద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Tags:    

Similar News