సీఎం సీపీఆర్ఓపై కూడా వేటు వేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో: నార్కట్ పల్లి తహసీల్దార్ రాధ పై బదిలీ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ పిరాయింపులను సమర్థించిన సీఎం సీపీఆర్ఓ (చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ )జ్వాలా నరసింహారావుపై కూడా వేటు వేయాలని కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ కోరారు. బహుజన సమాజ పార్టీ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 4న నార్కట్ పల్లి లో బసచేసిన హోటల్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: నార్కట్ పల్లి తహసీల్దార్ రాధ పై బదిలీ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ పిరాయింపులను సమర్థించిన సీఎం సీపీఆర్ఓ (చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ )జ్వాలా నరసింహారావుపై కూడా వేటు వేయాలని కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ కోరారు. బహుజన సమాజ పార్టీ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 4న నార్కట్ పల్లి లో బసచేసిన హోటల్ వద్ద కనిపించిన కారణాన నార్కట్ పల్లి తహసీల్దార్ రాధను ఆఘమేఘాల మీద బదిలీ చేయడం దారుణమని ఆయన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 5 వ తేదీన ఓ దినపత్రికలో ప్రభుత్యోగిగా కట్టుబాటులను ఉల్లంఘించి రాజకీయ విషయాలలో ప్రత్యక్ష జోక్యము చేసుకుని సీఎం సీపీఆర్ ఓ ప్రతి పక్షాల స్థితిని విమర్శించడం పార్టీ పిరాయింపులు చేయడమేనని ఆయన ఆరోపించారు. దీంతో తహసీల్దార్ రాధపై వేటు వేసినట్లే జ్వల నరసింహారావుపై కూడా వేయాలని జి నిరంజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి పక్షాల పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.