డేంజర్స్ బెల్స్‌పై డెసిషన్ పెండింగ్.. సీఎం కేసీఆర్ రివ్యూ!
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్యను పెంచాలని ఇప్పటికే అన్ని జిల్లాల పాలనాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పీహెచ్సీ సెంటర్లలలో రోజుకు కనీసం 100కు పైగా టెస్టులు జరపనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలతో బోర్డర్ పంచుకుంటున్న జిల్లాల్లో ఇప్పటికే యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మొన్నటి దాకా వందల్లోనే ఉన్న కేసులు ప్రస్తుతం వేలల్లో నమోదవుతుండటంతో ప్రభుత్వం కరోనా వ్యాప్తిపై సీరియస్ గా దృష్టి […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్యను పెంచాలని ఇప్పటికే అన్ని జిల్లాల పాలనాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పీహెచ్సీ సెంటర్లలలో రోజుకు కనీసం 100కు పైగా టెస్టులు జరపనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలతో బోర్డర్ పంచుకుంటున్న జిల్లాల్లో ఇప్పటికే యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మొన్నటి దాకా వందల్లోనే ఉన్న కేసులు ప్రస్తుతం వేలల్లో నమోదవుతుండటంతో ప్రభుత్వం కరోనా వ్యాప్తిపై సీరియస్ గా దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే గురువారం సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. దీంతో వైద్య ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఇదిలాఉండగా, సాయంత్రం 6.30గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ కరోనా వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంభాషించనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని సమావేశానికి ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యాధికారులతో సెకండ్ వేవ్ ప్రభావంపై సమీక్షించనున్నారు.