6నెలల్లో ఛనాక-కొరాట ప్రాజెక్టు పూర్తి: కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: ఛనాక-కొరాట ప్రాజెక్టును 2021జూన్ వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అటు.. హుజూర్‌నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపిన సీఎం.. అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టి సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, జుక్కల్ నియోజకవర్గంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి పనులు చేపట్టాలని సూచించారు. ప్రగతిభవన్‌లో సోమవారం సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఛనాక-కొరాట ప్రాజెక్టును 2021జూన్ వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అటు.. హుజూర్‌నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపిన సీఎం.. అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టి సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, జుక్కల్ నియోజకవర్గంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి పనులు చేపట్టాలని సూచించారు. ప్రగతిభవన్‌లో సోమవారం సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే జోగురామన్న, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.