సీఎం కేసీఆర్ వేటేసే ఆ ఐదుగురు మంత్రులు ఎవరు..?

దిశ,వెబ్ డెస్క్ : ఓవైపు జమిలి ఎన్నికలు…మరోవైపు ఓటములు. ఇలా అయితే పార్టీని నడిపించడం కష్టమేనని భావించిన సీఎం కేసీఆర్ త్వరలో భారీ మార్పులు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఐదుగురు మంత్రుల్ని కేబినెట్ నుంచి భర్తరఫ్ చేస్తారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వరుసగా వచ్చిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపొందుతూ వచ్చింది. స్థానిక ఎన్నికల నుంచి ఉపఎన్నికల వరకూ ఇలా అన్నీంట్లో విజయ దుందుభి మోగించింది. కానీ […]

Update: 2020-12-11 21:38 GMT

దిశ,వెబ్ డెస్క్ : ఓవైపు జమిలి ఎన్నికలు…మరోవైపు ఓటములు. ఇలా అయితే పార్టీని నడిపించడం కష్టమేనని భావించిన సీఎం కేసీఆర్ త్వరలో భారీ మార్పులు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఐదుగురు మంత్రుల్ని కేబినెట్ నుంచి భర్తరఫ్ చేస్తారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వరుసగా వచ్చిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ గెలుపొందుతూ వచ్చింది. స్థానిక ఎన్నికల నుంచి ఉపఎన్నికల వరకూ ఇలా అన్నీంట్లో విజయ దుందుభి మోగించింది. కానీ పరిస్థితులు మారాయ్. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి, జీహెఎంసీ ఎన్నికల్లో అనుకున్నంత ఫలితాలు రాబట్టలేకపోవడంతో సీఎం కేసీఆర్ నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్‌-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

మరోవైపు పార్టీలో కొందరు మంత్రుల తీరుపై అసంతృప్తి, బీజేపీని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు లేకపోవడంతో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేసీఆర్ త్వరలో కేబినేట్‌లో భారీ మార్పులు చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. డిసెంబర్ నెలాఖరులో కేబినెట్ లో ఐదుగురు మంత్రులను భర్తరఫ్ చేసి..వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు వినికిడి.

మరి భర్తరఫ్ చేస్తున్న ఐదుగురు మంత్రుల పేర్లు వెలుగులోకి రాకపోయినప్పటికి..,ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ ఇద్దరు మంత్రుల తీరుపై అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఇద్దరు మంత్రుల గురించి టీఆర్ఎస్ అనుకూల మీడియాలో వరుస కథనాలు రావడంతో.., కేబినెట్ లో మార్పులు ఖాయమనే సంకేతాలు జోరందుకున్నాయి.

Tags:    

Similar News