రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలను చెల్లించేందుకు  నిర్ణయించింది. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి నుంచి బకాయిలను కలిపి పింఛన్‌ను చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 సమయానికి చెందిన బకాయిలను మొత్తం 36 విడతల్లో చెల్లించనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, 2020 ఏప్రిల్ […]

Update: 2021-11-26 09:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలను చెల్లించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి నుంచి బకాయిలను కలిపి పింఛన్‌ను చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 సమయానికి చెందిన బకాయిలను మొత్తం 36 విడతల్లో చెల్లించనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం ఒకేసారి చెల్లిస్తారు.

Tags:    

Similar News